Skip to main content

Posts

Showing posts with the label Sutika paricharya

బాలింత తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రసవం అయ్యాక తల్లి శరీరం మళ్లీ పునః స్థితికి త్వరగా కోలుకోవాలి . ఇదే సమయం లో తల్లి బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం . ఈ సమయంలో తినే ఆహారం , వి హారం , పరిశుభ్రత వంటి   – అన్ని విషయాల్లో సరైన శ్రద్ధ అవసరం . ప్రసవం తర్వాత తినాల్సిన సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం మాంసకృత్తులు ( ప్రోటీన్ ) : గుడ్లు , పాలు , పెరుగు , చికెన్ , పప్పులు , శెనగలు , బాదం , వేరుశెనగలు తినాలి . ఇవి శరీరానికి బలాన్నిస్తాయి , గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి . ధాన్యాలు: బ్రౌన్ రైస్ , ఓట్స్ , గోధుమ రొట్టెలు లాంటి చిరు ధాన్యాల వంటి ఆహారం శక్తిని ఇస్తుంది .   పండ్లు , కూరగాయలు ఆకుకూరలు , బొప్పాయి , నారింజ , బీరకాయ , టమాటా వంటి వివిధ పండ్లు కూరగాయలు తినాలి . వీటి వల్ల విటమిన్లు , ఖనిజాలు శరీరానికి అందుతాయి కొవ్వు పదార్థాలు ( హెల్తీ ఫ్యాట్స్ ): అవకాడో , వేరుశెనగలు , నువ్వులు , కొద్దిగా ఆవు   నెయ్యి , నూనె వంటివి వాడొచ్చు . నీ ళ్ళు : పాలిచ్చేతల్లులు ఎక్కువగా నీరు తాగాలి . సాఫ్ట్ డ్రింక్స్ , టీ , కాఫీ లాంటివి తక్కువగా ఉండాలి ...