TRIKATU
శుంఠి, పిప్పలి, మిరియాలు మూడింటిని కలిపి ఆయుర్వేదంలో త్రికటు అని, త్రియూషము అని అంటాము.
ఇది శరీరంలో ఏర్పడ్డ కఫం,కొలెస్ట్రాల్ అంటే అధిక బరువు, శ్వాస, కాస, చర్మరోగాలు, గొంతులోని సమస్యలు, వాపులు, ఉదర రోగ వంటి సమస్యలు నివారించడానికి వైద్యులు వాడుతుంటాము.
ఇందులో శుంఠి-అల్లం పొడి, పిప్పళ్లు, మిరియాలు సమపాళ్లలో పొడిగా చేస్తారు.ఇవి మూడు కూడా కటు రసం అంటే కారం వంటి రుచి ని కలిగి వుంటాయని దీనికి ఈ పేరు.
మూడు కూడా ఉష్ణ వీర్యం ని కలిగి ఉంటాయి అంటే మనం ఈ ఔషధం తింటే శరీరంలో వేడిని పుట్టిస్తుంది.
ఈ లక్షణం వల్లనే ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, దమ్ము,ఊపిరితిత్తుల సమస్యలు, లావు,గర్భాశయ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం, PCOD, ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్ )వంటి కఫం-వాత సంబంధ సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది.
అలాగే ఇందులోని శుంఠి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు అంటే అరుచి, అజీర్ణం, IBS లో సరిఅయిన అనుపానం, మోతాదుతో వాడితే ఉపశమనం ఇస్తుంది.
అలాగే ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ నుండి తట్టుకోవడానికి చాలావరకు మంచిది.
తినడానికి 20నిమిషాల ముందు 3gm త్రికటు చూర్ణం తేనెతో తీసుకోవాలి. రోజుకు 3సార్లు
దగ్గు ఉన్నవాళ్ళు 2gm పొడిని తేనెతో చప్పరించాలి రోజుకి 5సార్లు వాడవచ్చు.
ఒబెసిటీ పోవడం కొరకు 1 టీ స్పూన్ త్రికటు గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి తినడానికి ముందు.
మజ్జిగ, గంజి, భోజనంలో ఇలా కూడా వాడవచ్చు.ఇందులో ఉండే రసాయనాలు రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తాయి అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగడానికి పాంక్రయాటిక్ సెల్స్ ను ఉతేజపరుస్తాయి.
శరీరంలో కఫం, చెడు కొలెస్టెరాల్ పెరగకుండా చూస్తుంది.
అయితే ఎసిడిటీ, పిత్త ప్రకృతి శరీరం గల వారు, పుల్లని వాంతులు అయ్యేవారిలో ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
అనుపానం, మోతాదు అనేది వ్యక్తి యొక్క సమస్య, జఠరాగ్ని బలం, శరీరప్రకృతి వంటి లక్షణాలను చూసి నిర్ణయించడం జరుగుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు...
కన్సల్టెంట్ డాక్టర్స్
Dr. వరకాల యామిని సౌభాగ్య MS
&
DR.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్
Very informative article ma'am.
ReplyDeleteCan I expect this article in Hindi?
Gold MedalistJuly 15, 2020 at 2:19 PM
Yes ..in future
ReplyDelete👌👍
ReplyDeleteGold MedalistJuly 15, 2020 at 4:01 PM
Thank you
Delete