ప్రసవం అయ్యాక తల్లి శరీరం మళ్లీ పునః స్థితికి త్వరగా కోలుకోవాలి. ఇదే సమయం లో తల్లి బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ సమయంలో తినే ఆహారం, విహారం, పరిశుభ్రత వంటి – అన్నివిషయాల్లో సరైన శ్రద్ధ అవసరం.
ప్రసవం తర్వాత తినాల్సిన సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం
మాంసకృత్తులు(ప్రోటీన్):
గుడ్లు, పాలు, పెరుగు, చికెన్, పప్పులు, శెనగలు, బాదం, వేరుశెనగలు తినాలి. ఇవి శరీరానికి బలాన్నిస్తాయి, గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి.
ధాన్యాలు:
బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ రొట్టెలు లాంటి చిరు ధాన్యాల వంటి ఆహారం శక్తిని ఇస్తుంది.
పండ్లు, కూరగాయలు
ఆకుకూరలు, బొప్పాయి, నారింజ, బీరకాయ, టమాటా వంటి వివిధ పండ్లు కూరగాయలు తినాలి . వీటి వల్ల విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి
కొవ్వు పదార్థాలు (హెల్తీ ఫ్యాట్స్):
అవకాడో, వేరుశెనగలు, నువ్వులు, కొద్దిగా ఆవు నెయ్యి, నూనె వంటివి వాడొచ్చు.
నీళ్ళు:
పాలిచ్చేతల్లులు ఎక్కువగా నీరు తాగాలి.
సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ లాంటివి తక్కువగా ఉండాలి.
తగ్గించాల్సినవి
🚫 జంక్ ఫుడ్, బిస్కెట్లు, బర్గర్ లాంటి మరియు నూనె లో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినొద్దు.
🚫 మద్యపానం, అధిక కాఫీ, ప్యాక్డ్ డబ్బాలో వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి
తగినంత విశ్రాంతి :
· పాలిచ్చే తల్లులు తగిన విశ్రాంతి తీసుకోవాలి
· ఇంటి పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి
· కొంచెం కొంచెంగా డాక్టర్ పర్యవేక్షణ లో నడక మొదలు పెట్టొచ్చు.
పరిశుభ్రత మరియు గాయాల యొక్క సంరక్షణ
· ప్రతిరోజూ స్నానం చేయాలి
· చేతులు కడగాలి
· సిజేరియన్ గాయం/ఎపిసోటోమీ (నార్మల్ ) డెలివరీ గాయం ఉన్నవారు డాక్టర్ చెప్పిన విధంగా శుభ్రంగా ఉంచాలి
· పొట్ట బలంగా కట్టేయకండి, డాక్టర్ పర్యవేక్షణ లో బెల్ట్ వాడవచ్చు
· బెల్ట్ కాస్త గాయం మానక, గాయం పై నుండి కట్టడం ఉత్తమం.
· చాలా మంది గాయం ఉన్నందున గాయం పై గట్టిగా బిగ పెట్టి బంధనం లేదా బెల్ట్ కడతారు, ఇలా చేస్తే రానున్న రోజుల్లో హెర్నియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా కట్టడం ఉత్తమం.
వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించండి
తల్లి, బిడ్డ ఇద్దరికీ షెడ్యూల్ ఉన్న వైద్య పరీక్షలు మిస్ అవకూడదు
జ్వరం, ఎక్కువగా రక్తస్రావం, తట్టుకోలేనంత నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.
శతావరీ చూర్ణం, బాలంత క్వాద,జీరకారిష్ట వంటి ఔషధాలు వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవచ్చు
డాక్టర్ అనుమతి లేకుండా ఆయుర్వేద ఔషధాలు, కషాయాలు, అశాస్త్రీయమైన పాతకాలపు పరిహారాలను వాడకండి,ఎలాంటి ఆరోగ్య ప్రామాణికత లేని ప్రక్రియలు చేయకండి
మానసికంగా డౌన్ ఫీలవుతున్నప్పుడు, ఎప్పటికీ అలాగే ఉంటే మానసిక వైద్య సహాయం తీసుకోవాలి
పాలిచ్చే తల్లులకి సూచనలు
6 నెలల వరకు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వడం శ్రేయస్కరం
బిడ్డకు కావాల్సినప్పుడు పాలివ్వాలి,లేదా ప్రతి రెండు గంటలకి ఏడవక పోయినప్పటికీ పాలు ఇవ్వాలి.
తల్లికీ, బిడ్డకూ కంఫర్ట్గా ఉండేలా పాలివ్వాలి
అవసరమైతే లాక్టేషన్ నిపుణుల సహాయం తీసుకోవచ్చు
తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి, అందుకని గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
చల్ల గాలికి దూరం గా ఉండడం వల్ల నొప్పి పెరగకుండా ఉంటుంది.
సాధ్యమైనంత వరకు కోపము, మానసిక వత్తిడి, ఏడుపు లను తగ్గించుకోవాలి.
తల్లి కావడం గొప్ప వరం తో కూడుకున్న బాధ్యత.
గమనిక:
ఈ సమాచారం సాధారణ సూచన మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి తగిన సూచనల కోసం తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించండి.
By
డా.వరకాల యామిని సౌభాగ్య
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రసూతి స్త్రీ రోగ విభాగం
డా.బి.ఆర్. కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల
హైదరాబాద్
Comments
Post a Comment
Thank you for your comment.
Swasthya Swastha Rakshanam 😇