1.మాచీ పత్రం (మాచి పత్రి)
అర్త్మీసియా వల్గారిస్- మంచి సువాసన గల పత్రి తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.
2.బృహతీ పత్రం (వాకుడు)
దగ్గు, ఉబ్బసం, గొంతు, ఊపిరితిత్తుల సమస్య లను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.
3.బిల్వ పత్రం (మారేడు)
ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఆకు వనరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.. ఈ చెట్టు పిందె ని విరేచనాల్లో
నివారణ గా ఆయుర్వేదం నందు చెప్పబడింది.
4.దుర్వాయుగ్మం (గరిక)
రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలకు
నివారకంగా పనిచేస్తుంది.
5.దత్తూర పత్రం (ఉమ్మెత్త)
ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతాలకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాట్లకు విషహారిణిగా పనిచేస్తుంది.
6.బదరీ పత్రం (రేగు)
అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. సుఖ ప్రసవానికి కూడా కాషాయ వస్తి గా ఇస్తారు.
7.అపామార్గ పత్రం (ఉత్తరేణి)
గాయాలను మాన్పడంలో, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
8.తులసీ పత్రం (తులసి)
దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులలను నివారిస్తుంది. క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.
9.చూత పత్రం (మామిడి ఆకు)
మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైనది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
10.కరవీర పత్రం (గన్నేరు)
తలలో చుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్క విష తుల్యం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
11.విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)
దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, బ్వరాలను నివారిస్తుంది.
12.దాడిమీ పత్రం (దానిమ్మ)
శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కష్టాలను హరింపజేస్తుంది.
13.దేవదారు పత్రం (దేవదారు)
దేవదారు తైలం చర్మవ్యాధులు, గొంతు సమస్య లు. పేగులో పుండ నివారణకు, కండరాల బలో పేతానికి ఉపయుక్తంగా ఉంటుంది.
14.మరువక పత్రం (మరువం)
నరాల ఉత్ప్రేరణకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగ పడుతుంది.
15.సింధువార పత్రం (వావిలి)
వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.
16.జాజీ పత్రం (జాజి ఆకు)
ఈ ఆకులు శరీరానికి వేడిని, శక్తిని అందించి, వాషల్ని, నొప్పిని తగ్గిస్తాయి. రక్త శుద్ధి చేస్తాయి.
17.గండకీ పత్రం (దేవకాంచనం)
కడుపులో నులిపురుగులను హరిస్తుంది.
18.శమీ పత్రం (జమ్మి ఆకు)
ఈ ఆకురసం మాడుకు చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగ నిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది
19.అశ్వత్థ పత్రం (రావి ఆకు)
శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషా లను నివారించేందుకు వినియోగిస్తారు.
20.అర్జున పత్రం (తెల్ల మద్ది)
దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండడానికి దోహదం చేస్తుంది.
21.అర్క పత్రం (తెల్ల జిల్లేడు)
Comments
Post a Comment
Thank you for your comment.
Swasthya Swastha Rakshanam 😇