శరీరం లో శీతలీకరణ వ్యవస్థ మందగిస్తుంది. అప్పుడు చర్మం పొడిబడటం,శ్వాస ఎక్కువసేపు తీసుకోవడం, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు,కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ కారణాల చేత శిశువుకి రక్త ప్రస రణ తగ్గిపోతుంది. దీని వల్ల శిశువు ఎదుగుదల దెబ్బతినే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో నిర్జలీకరణం కారణంగా శిశువుకి గర్భం లోపల ఉండటం కష్టం అవుతుంది. ఈ కారణంగా గర్భ నష్టాలకు గురవుతుంది. ఈ పరిస్థితి పుట్టుకలో వచ్చే లోపాలు (అంగ వైకల్యం) కి దారి తీస్తుంది.
ఒక వేళ గర్భిణీ స్త్రీ గర్భం దాల్చడా నికి ముందే రక్తపోటుతో బాధపడుతున్నట్లైతే, రక్తపోటు అదుపులో ఉంచడానికి 'మూత్ర విసర్జన ' మందులను వాడుతున్నట్లైతే వెంటనే అవి ఆపి వేసి డాక్టర్ల పర్యవే క్షణ లో ప్రత్యామ్నాయ మందులను వాడాలి.
గర్భధారణ సమయం లో నిర్జలీక రణం వలన తల్లి శిశువు మూత్రపిండం, కాలేయం మీద కూడా ప్రయాసని ఉంచుతాయి. దీని వలన ప్రసవ సమయం లో సమస్య ఎదురవవచ్చు. అదే చివరి మూడు నెలలో నిర్జలీకరణ వలన పురిటి నొప్పులు ముందే మొదలయ్యి అకాల ప్రసవం కావచ్చు
అందువల్ల తగినన్ని జాగ్రత్తలతో పరిస్థితి నియంత్రించవచ్చు.
1. తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, ద్రవాహారం ఏకువగ తీసుకోవడం.
2. వేవిళ్ల ను అదుపులో ఉంచడానికినల్లం ముక్కలను తేనె లో ఊరబెట్టి తీసుకోవాలి.
3. వాంతులు విరేచనాలు - రెండు ఉన్నట్లైతే శొంఠి, మారేడు కాషాయం కలిపి తీసుకోవాలి.
4.మద్యపానం, తేనీరు, కాఫీ లాంటి పదార్థాలు తాగవద్దు.
5.వ్యాయామం, ప్రయాణం చేయకుండా ఉండటం మేలు.
6. వీలైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం.
ఎండ ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి.
7. వదులుగా ఉన్న లేత రంగు , కాటన్ వంటి దుస్తులను ధరించడం మంచిది.
8. పడుకునెప్పుడు ఎడమ వైపుగా తిరిగి పడుకోవడం మేలు. దీని వల్ల శిశువు రక్త ప్రసరణ బాగా అందుతుంది.
Published in Mana Telangana News Paper (Nari - Sheershika)
Helpful
ReplyDelete