వర్ష ఋతు చర్య:
అంటే వర్షా కాలం మొదలలయినప్పటి నుండి తరువాతి ఋతువు వరకు పాటించవలసిన ఆహార మరియు విహారాల గురించి తెలియ చెప్పడం.
అగ్ని అంటే ఆకలి బలహీనంగా మారుతుంది.వాతావరణంలోని మేఘాలు, చల్లగాలి, నీళ్లు, వీదురు గాలులు, భూమి యొక్క వేడి ఇలాంటి కారణాల వల్ల శరీరంలో త్రిదోషాలు దూషితం చెందే అవకాశం ఉంటుంది.
అగ్ని తక్కువగా ఉంటుంది కావున ఆహారంలో ఆకలి పెంచే మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.
అంటే పాత ధాన్యం,
పప్పు యొక్క జావా లేదా సూప్,
మజ్జిగ పైన పేరుకున్న నీళ్లు
మాంసరసం
వేడి చేసి చల్లార్చిన నీళ్లు
సూర్యరశ్మి లేని రోజుల్లో తేనె, పులుపు, లవణం, స్నిగ్ధ గుణాలు కలిగిన తొందరగా జీర్ణమయ్యే ఆహరం తీసుకోవాలి.
వేడికి, చలికి దూరంగా ఉండాలి.
పగటినిద్ర, ఎక్కువ శ్రమ, సూర్యుడు వేడికి ఉండటం మంచిది కాదు.
ఇక కరోనా కి సంబంధించిన భయం కూడా ఈ వర్షాకాలానికి తోడైంది కావున కుటుంబ ఆరోగ్యమ్, సమాజ ఆరోగ్యం కూడా ముఖ్యం.
అందు గురించి సాధ్యమైనంత వరకు సామజిక దూరం, శరీర శుభ్రత, రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి.
సర్వేజనా సుఖినోభవంతు...
Dr.K.V.మాలతి
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్
Comments
Post a Comment
Thank you for your comment. Stay Home! Stay Safe